వేమన పద్యాలు
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
భావం – మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం – ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే)దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ
భావం- ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది.నీటిలోన పడిన చినుకు వ్యర్ధం అవుతుంది.అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.
చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
భావం – అడవికి మృగరాజు అయిన సిమ్హం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.